13 August, 2026 | 2:48 AM

యువతే దేశ భవిష్యత్తు

13-08-2026 12:14 AM

ఆచార్య చివుకుల ఉష

శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (విజయక్రాం తి): అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బీహెచ్‌ఈఎల్ శేరిలింగంపల్లి జూనియర్ కళాశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కా ర్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ జి. ర విందర్ అధ్యక్షతన, కేంద్రీయ విశ్వవిద్యా లయం ఆచార్య చివుకుల ఉష ముఖ్య అ తిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ నిర్వ హించారు. ఆచార్య ఉష మాట్లాడుతూ,

ఈ సంవత్సరం నినాదం “విభిన్న సందర్భాలు  ఉమ్మడి ఆకాంక్షలు” అని తెలిపారు. యువశ క్తితోనే దేశం అభివృద్ధి చెందుతుందని, వి ద్య, ఉపాధిలో ఏకాగ్రత, పట్టుదల అవసర మని, దురలవాట్లకు దూరంగా ఉండి యో గా, ధ్యానం అలవరచుకోవాలని సూచిం చారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరం గా ఉంటామని, దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధుసూదన రావు, అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.