23-05-2025 02:10:46 AM
భద్రాద్రి కొత్తగూడెం/ ఖమ్మం మే 22, (విజయక్రాంతి) ఖమ్మం శ్రీ ప్రభాత్ టాకీస్ రోడ్ రా మాలయం ఎదురుగా ఉన్న భక్తాంజనేయ స్వామివారి దేవాలయం లో గురువారం హనుమ జ్జయంతి సందర్భంగా భక్తాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొని పునీతులయ్యారు. ఉదయం 6 గంటలకు శ్రీ భక్తాం జనేయ స్వామి వారికి విశేష ద్రవ్యములతో అభిషేకము , 8 గంటలకు విశేషాలంకరణ ,
మన్య సూక్త పారాయణం , 9 గంటలకు విశేష నాగవల్లి పుష్పార్చన , 9:30 గంటలకు మంగళహారతి, మంత్రపుష్పం తీర్ధ ప్రసాద వినియోగం , మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నప్రసాద వితరణ నిర్వహించినట్లు ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ గట్టు హరీష్ శర్మ తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఏసీపి రమణమూర్తి , వన్టౌన్ సిఐ కరుణాకర్ , ట్రాఫిక్ సీఐ పాల్గొని భక్తాంజనేయ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు . కమిటీ సభ్యులు అశోక్ , సురేష్ , వంశీకృష్ణ , శ్రీకాంత్ , శ్రీనివాస్ , వసంత కుమార్ , దత్తు తదితరులు పాల్గొన్నారు