23-05-2025 02:08:28 AM
కల్లూరు,మే22 (విజయ క్రాంతి) పెనుబ ల్లి, కల్లూరు, తల్లాడ మండలాల రైతులకు ప్రభుత్వం 2025- 26వ సంవత్సరానికి వా ర్షిక ప్రణాళిక ఖరారు చేశారు. జిల్లాకు రూ.408 కోట్లు కేటా యించి, ఉద్యాన పంటలతో తక్కువ ఖర్చుతో అధిక లాబాలు పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విరివిగా రాయితీలు అందిస్తోంది. ఆకాల వర్షాల కారణంగా నష్టాలు చవి చూసిన రైతాంగం త క్కువ ఆదాయం గల పంటలు సాగు చేస్తున్నవారు.
పంట మార్పిడి చేసి అధికా దాయం ఇచ్చే, ప్రత్యామ్నాయ పంటల కోసం ఈ రాయితీలు దోహదపడతాయి.ఈ సంవత్సరం వార్షిక ప్రణాళిక అమలు ప్రక్రి యను జిల్లా అధికారులు గురువారం ప్రారంభించారు. ఆసక్తి గల రైతులు సద్విని యోగం చేసుకో వాలని ఉద్యాన శాఖ అధికారి జి నగేష్ తెలిపారు.
బిందు సేద్యం పథకం...
బిందు సేద్య(డ్రిప్) పరికరాల కోసం జిల్లాకు మొదటి విడతగా రూ. 16.17 కోట్ల అంచనాతో 1710 ఎకరాల భౌతిక లక్ష్యాలు కేటాయించారు. షెడ్యూలు కులాలు, తెగల రైతులకు 100 శాతం, వెనుకబడిన, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ కల్పించారు. డ్రిప్ కోసం రైతులు సమీపం లోని మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆయిల్ పాం సాగు...
కోతులు, దొంగల బెడడ లేని ఏకైక పంట ఇది జిల్లాలో ఈ ఏడాది 14,500 ఎకరాల్లో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు లో బాగంగా రెండు అయిల్ కంపెనీలైన తెలంగాణ ఆయిలెడ్, గోబ్రెజ్ కంపెనీలు మొక్కలు అందుబాటులో ఉన్నట్లు తెలిపా రు. డ్రాగన్ ఫ్రూట్, అరటి, అంజీర, ఆవ కాడో, బొప్పాయి, ఉసిరి, మామిడి, నిమ్మ, జాను, హైబ్రిక్ కూరగాయలు, పూల తోటల పెంపకానికి రాయితీ కల్పిస్తున్నారు.
కూరగా యల సాగు పెంచేందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా శాశ్వత మందిళ్ల నిర్మాణాలు, మల్చింగ్ షీట్, జాతీ య వెదురు మిషన్ ద్వారావెదురు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వెదురు మొక్కలు నాటిన రైతులకు రాయితీ కల్పిస్తోంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయ రంగంలో రాణించాలని ప్రభుత్వం ఆకాంక్ష.