calender_icon.png 23 May, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిగ్విజయంగా ముగిసిన అన్నప్రసాద వితరణ

23-05-2025 02:11:33 AM

కొత్తపల్లి, మే 22: కరీంనగర్ లోని కురుమ వాడ బాల భక్తాంజనేయ ఆలయంలో గత 23 రోజులుగా చేపట్టిన అన్నప్రసాద కార్యక్రమం ముగిసింది. మే 1వ తేదీన ప్రారంభమై 22వ తేదీవరకూ పలువురు దాతల సాయంతో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం కొనసాగింది. 23 రోజులుగా మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి కూరగాయల దాతగా వ్యవహించారు.

చివరి రోజున కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లే స్వాములకు మజ్జి గ, జ్యూస్ తోపాటు వాటర్ బాటిల్స్ అందించారు. వీటికి కోట రజనీ సతీష్ కుమార్, మనీషాంతన్, దుర్గశ్రీ, సహస్ర దాతలుగా వ్యవహరించారు. చివరి రోజున స్వాములకు అందించే అన్న ప్రసాదానికి డాక్టర్ ముదలి వసంతరావు-తులసి, కుమారుడు విశాల్, కూతుర్లు సౌమ్య, సాహిల్, అప్పల నర్సమ్మలు అన్నదాతగా వ్యవహరించారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చింతల రమేష్, మడ్లపల్లి మల్లేశం, సంద తిరుపతి, బుడగ జంగాల మల్లేశం, సంద అశోక్, అన్నం శ్రీనివాస్, దాసరి భూమ్ రావు, శ్రీనివాస్ పటేల్, విజయ్ గౌడ్, మహిళా సేవకులు, మమత, రజని, లక్ష్మీ, రజిత, మాధవి, సరస్వతి, విజయ తదితరులు పాల్గొన్నారు.