15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

5న వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు

03-11-2025 01:36 AM

కొల్చారం, నవంబర్ 2 :కార్తీక మాసం సందర్భంగా మండల కేంద్రమైన కొల్చారంలోని పురాతన వీరభద్ర ఆలయంలో ఈనెల 5న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి బక్కప్ప తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పూజారులు సంగమేశ్వరప్ప, యోగేశ్వరప్ప, మహేష్ అప్ప ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, ఆలయ ప్రాంగణంలో దీపారాధన,

ఆకాశదీపం వెలిగించడం జరుగుతుందన్నారు. దీపాల కాంతులు వెలుగులీనుతుండగా మిరుమిట్లు గొలిపే వీరభద్ర ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభన సంతరించు కుంటుందన్నారు. భక్తులు బుధవారం నిర్వహించబోయే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో అశేష సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. దీపారాధన కార్యక్రమం, ఆకాశ జ్యోతి దర్శనం ఉంటుందని తెలిపారు.