03-11-2025 01:34:39 AM
సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్
సిద్దిపేట, నవంబర్ 2 (విజయక్రాంతి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రహమత్ నగర్, బోరబండ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మైనంపల్లి హన్మంతరావు, సినీ యాక్టర్ సుమన్, పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లతో కలిసి కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఆత్తు ఇమామ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారని, ఇన్నేళ్ల పాటు బీఆర్‌ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గయాజుద్దీన్, హర్షద్ , బబ్బు, నజ్జు, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.