calender_icon.png 9 May, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా..

16-03-2025 08:34:33 PM

రెచ్చగొట్టేలా చాటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు..

ఓడేడులో అవగాహన సదస్సులో మంథని సిఐ రాజు...

మంథని (విజయక్రాంతి): సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని, ఎవరైనా రెచ్చగొట్టేలా చాటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఓడేడు గ్రామంలో అవగాహన సదస్సులో మంథని సిఐ రాజు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం గ్రామంలో ముత్తారం ఎస్ఐ నరేష్ తో సీఐ రాజు అవగాహన సదస్సులో గ్రామస్తులతో మాట్లాడారు. ప్రజలు సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండాలని, కొంతమంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రజలను రెచ్చగొట్టేలా చాటింగ్ చేస్తున్నారని, వారిని గుర్తించి, త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. అత్యవసర వేల ప్రజలు 100కు డయల్ చేయాలని, సైబర్ క్రైమ్ ఉచ్చులో పడద్దని, ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. రాత్రి, పగలు పోలీస్ పెట్రోలింగ్ పెంచామని ఓడేడు పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అప్రమంతంగా ఉంటారని సిఐ తెలిపారు.