03-08-2025 04:13:30 PM
హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాల క్రితం నగర పరిధిలోని ట్రైబల్ హాస్టల్ కు విద్యార్థుల సౌకర్యార్థం కోసం లక్షలాది రూపాయల నిధులతో టీం కుక్కర్స్ ను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు అందజేశారు. వంట సిబ్బందికి జిల్లాల వారీగా శిక్షణ శిబిరాలను నిర్వహించినప్పటికీ హాస్టల్లో అమర్చిన స్టీమ్ కుక్కర్స్ వంట విధానంపై వివరాలను తెలపకపోవడంతో అధికారుల నిర్లక్ష్యంగా, స్టీమ్ కుక్కర్స్ శిథిలావస్థకు చేరాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి స్టీమ్ కుక్కర్స్ పరికరాలను ట్రైబల్ విద్యార్థులకు ఉపయోగపడేలా చూడాలని విద్యార్థులు, ట్రైబల్ హాస్టల్ వార్డెన్లు కోరుతున్నారు.