03-08-2025 04:08:19 PM
హైదరాబాద్: మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని కొరియోగ్రాఫర్ కృష్ణ(Choreographer Krishna)పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్(Gachibowli Police Station)లో ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో, గచ్చిబౌలి పీఎస్‌లో అతనిపై పోక్సో(POCSO) చట్టం కింద కేసు నమోదు అయింది. కేసు నమోదైన తర్వాత కృష్ణ మాస్టర్ పరారీలో ఉన్నాడు. కానీ సాంకేతిక ఆధారాలు, ఫోన్ ట్రాకింగ్, సోషల్ మీడియా లొకేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ ఆధారంగా బెంగళూరులో తలదాచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజా నమోదైనా ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు బెంగళూరులో పట్టుకుని అరెస్ట్ చేసి.. విచారణ ప్రారంభించారు. కాగా, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్‌గా కృష్ణ మాస్టర్ పనిచేశారు.