calender_icon.png 7 November, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు తెలంగాణలో వందేమాతరం సామూహిక గీతాలాపన

07-11-2025 08:44:11 AM

హైదరాబాద్: నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక వందేమాతరం(Vande Mataram) గీతాలాపన కార్యక్రమం నిర్వహించనునున్నారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా సామూహిక గీతాలాపన చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం మొదలు కానుంది. అబిడ్స్ లో మహబూమియా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణరావు పాల్గొనున్నారు. కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.