calender_icon.png 7 November, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తి.. దేశవ్యాప్తంగా వేడుకలు

07-11-2025 09:00:22 AM

  1. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు
  2. వందేమాతరం జాతీయ గేయం 150వ వార్షికోత్సవాలు..
  3. వార్షికోత్సవాలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
  4. దేశంలో ఏడాది పొడవునా వందేమాతరం కార్యక్రమాలు
  5. కవిత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు

న్యూఢిల్లీ: నేటితో వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తి(India Celebrates 150 Years) అయింది. వందేమాతరం గీతానికి 150 ఏళ్లయిన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో(Indira Gandhi Stadium) ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఏడాది పొడువునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం ప్రధాని మోదీ స్మారక స్టాంపు, నాణాన్ని విడుదల చేయనున్నారు.

శుక్రవారం ఉదయం 9.50 గంటలకు బహిరంగా ప్రదేశాల్లో వందేమాతరం(Vande Mataram) గీతాలపన చేయాలని, గీతాలాపన తర్వాత స్వదేశీ వస్తువులే కొనుగొలు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు(Vande Mataram programs) నిర్వహించనున్నారు. కవిత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలను కేంద్రం నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అబిడ్స్ లో మహబూమియా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.