calender_icon.png 2 May, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ ప్రక్రియలో వేగం పెంచాలి

02-05-2025 12:00:00 AM

  1. క్షేత్రస్థాయిలో తనిఖీలు, రోజువారీ నివేదికలు అందజేయాలి

ప్రతి మిల్లరూ గడువులోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలి

అధికారులు, రైస్ మిల్లర్ల సమీక్షలో కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం

నిర్మల్, మే 1 (విజయక్రాంతి): జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో ఆమె సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీఎంఆర్ సరఫరాలో ప్రతీ మిల్లరూ గడువులోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ ప్రక్రి యలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుంచి రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించాలంటే వారు తప్పని సరిగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ధాన్యాన్ని ప్రభుత్వానికి అందజేస్తామన్న ఒప్పందం చేసుకుంటే నే వారికి ధాన్యం కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా, యాక్షన్ ప్యాడికి సంబం ధించిన మిగిలిన మొత్తం వెంటనే డిపాజిట్ చేయాల ని సూచించారు.

రైస్ మిల్లులలో హమాలీల సంఖ్య ను పెంచి మిల్లింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిల్లర్లకు నిర్ధేశించిన లక్ష్యా లు, ఇప్పటివరకు సరఫరా చేసిన సీఎంఆర్, మిగిలిన ధాన్యం, రోజువారీగా తరలిస్తున్న లారీల వివరాలను రైస్ మిల్లుల వారీగా కలెక్టర్ సమీక్షించారు.

రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు మిల్లుల్లో ధాన్యం నిల్వ, సామర్థ్యం, అన్లోడింగ్ పరిస్థితులు తదితర అంశాల పై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, రోజువారీ నివేదికలు అందజేయాలని సూచించారు. ఈ సమా వేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, డీఎం సివిల్ సప్లయిస్ సుధాకర్, ఎల్డిఎం రామ్ గోపాల్, పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.