01-05-2025 10:46:23 PM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ సర్కిల్ గెస్ట్ హౌస్ రోడ్డులోని సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సత్యసాయి సేవా సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గండి వెంకటేశ్వర్లు, కన్వీనర్ నోముల కైలాష్ సంయుక్తంగా గురువారం ప్రారంభించారు. తదనంతరం వారు మాట్లాడుతూ... ఎండాకాలం ఎండలకు బాటసారులకు ఈ చలివేంద్రం ద్వారా నిత్యం మంచినీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం ఈ సేవా సమితి యొక్క లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు టీవీఎన్ మూర్తి, నరసింహారావు, నారాయణ, పద్మిని, అరుణ, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.