calender_icon.png 11 September, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14న అన్నదాతకు ఆత్మీయ సత్కారం

04-09-2025 01:06:09 AM

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో రైతులను కాపాడాలి, రైతులను గౌరవించాలనే ఉద్దేశ్యంతో అన్న దాతకు ఆత్మీయ సత్కారం కార్యక్రమాన్ని ఈ నెల 14న నిర్వహిస్తున్నామని యూ త్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేం ద్ర పల్నాటి తెలిపారు. అందులో భాగంగా కార్యక్రమానికి సం బంధించిన పోస్టర్‌ను బుధవారం మాజీ ఎ మ్మెల్యే బక్కని నర్సింహులు, మాజీ వ్యవ సాయ అధికారి అశో క్‌కుమార్ ముఖ్య అతిథిగా హజరై ఆవిష్క రించారు.

అనంతరం వారు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అన్నదాతల సంఖ్య పెరగడం లేదని, నేటి సమాజంలో రైతన్నకు అండ కరువైపోయిందన్నారు. రైతును బతికించాలి, యువ రైతులను పెంపొందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 14న నిర్వహిస్తున్నామని రాజేంద్ర తెలిపారు.

రెండు రాష్ట్రాల కు సంబంధించిన రై తులను ఎంపిక చేస్తున్నామని, ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ జేడి లక్ష్మినారాయణ, సంగీత దర్శకులు ఆ ర్పీ పట్నాయక్ హజరవుతున్నారని తెలిపా రు.   కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ శాస్రవేత్త డా. బి శ్రీనివాస్ రావు, వరి కుప్పల గంగాధర్, పాశిగంటి వంశీకృష్ణ, నాగేంద్ర, నరేష్ తదితరులు పాల్గొన్నారు.