calender_icon.png 11 September, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 వరకు వర్షాలు

04-09-2025 01:05:37 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఈనెల 8వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. ఉరుములు, మెరుపులు, 30 కి.మీ.లతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా ఈనెల 8వ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని సూచించింది.