calender_icon.png 27 November, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు ఆటల పోటీలు

27-11-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా బుధవారం ఆర్‌కె పురం లోని విఆర్ అంబేద్కర్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో దివ్యాంగుల ఆటల పోటీలను మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా . ఈ పోటీలకు మేడ్చల్ జిల్లాలోని దాదాపు 15 ప్రత్యేక పాఠశాలల విద్యార్థులు, అలాగే జిల్లాలోని వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

గెలిచిన వారిని రాష్ట్రస్థాయిలో జరిగే దివ్యాంగుల పోటీలకు పంపుతామని డీడబ్ల్యూ శార ద తెలియజేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు తమ వంతు సహాయా న్ని అందజేస్తామని, ప్రతి ఒక్కరిలో నైపుణ్యాలు ఉంటాయని వాటిని బయటకు తీసి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని టీచర్లకు, విద్యా సంస్థల అధిపతులకు తెలియజేశారు. ఈ విద్యార్థులను డిఫరెంట్ లీ కేబుల్ చిల్డ్రన్‌గా సంబోధించడం సముచితమని చెప్పా రు.

ఈ పోటీలకు దాదాపు 700 పైగా విద్యార్థులు, వందమంది దివ్యాంగ సంఘాల ప్రతినిధులు పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని నిర్వాహక అధ్యక్షుడు ఉమర్ ఖాన్ చెప్పారు. ఈ పోటీలకు అతిథులుగా మధుసూదన్‌రెడ్డి, పాపారావు, శ్యాంసుందర్, సీడీపీవో స్వాతి, రేణుక గుత్తికొండ కిరణ్, వెంకట్, ఎన్ పి ఆర్ డి వినయ్, టైగర్ నరసింహ, చంద్రమోహన్, నాగరాజ్ గౌడ్, డీ డబ్ల్యూ ఆఫీసు సిబ్బంది, హెలెన్ కెల్లర్స్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.