27-11-2025 12:00:00 AM
మైలారం గ్రామంలో సేవా కార్యక్రమాలు
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): మైలారం గ్రామంలో మండలంలో ని వివిధ గ్రామాలకు చెందిన 50 మంది ది వ్యాంగులు, వృద్ధులకు బ్యాటరీ సైకిళ్లు, ట్రై సైకిళ్లు, వీల్‌చెయిర్లను పంపిణీ చేశారు. ఊక ల్ పాఠశాల విద్యార్థులకు టీ-షర్టులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పా ల్గొని.. పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.
సన్నూర్ సర్పంచ్ అభ్యర్థి ఎంపిక
రాయపర్తి మండలం సన్నూర్ గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో సర్పంచ్ అభ్యర్థిగా చిన్నపాక రాంబాబును ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ నాయక్, మండల నాయకులు లేతకుల రంగా రెడ్డి, లేతకుల మధుకర్ రెడ్డి, గజావెల్లి ప్రసాద్, లేతకుల మహేందర్ రెడ్డి, కోలా సంపత్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేత రాజిరెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరిక మైలారం గ్రామంలో మరో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరుపాటి రాజిరెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ నాయక్, మండల నాయకులు లేతకుల రంగారెడ్డి, లేతకుల మధుకర్‌రెడ్డి, సంధి దేవేందర్‌రెడ్డి, లేతకుల మహేందర్‌రెడ్డి, గుడెల్లి వెంకటయ్య, ఐరెడ్డి వెంకన్న, లేతకుల యకూబ్‌రెడ్డి, బొమ్మినేని సురేందర్‌రెడ్డి, నందనబోయిన యాకయ్య, పట్టపురం బిక్షపతి, చందు లక్ష్మన్, ఎండీ యకూబ్ తదితరులు పాల్గొన్నారు.