calender_icon.png 27 November, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వజ్ఞ స్కూల్‌లో రాజ్యాంగ దినోత్సవం

27-11-2025 12:00:00 AM

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణం వీడీవోస్ కాలనీలోని సర్వజ్ఞ పాఠశాలలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆర్‌వి నాగేంద్రకుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి రాజ్యాంగ విశిష్టత, ప్రాముఖ్యతపై పరేడ్, ప్రదర్శనలు, రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆర్‌వి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ..

రాజ్యాంగ దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అయితే, ఇది 1950 జనవరి 26 నుంచి అధికారికంగా అమలులోకి వచ్చిందన్నారు. రాజ్యాంగ పితామహుడు డా. బి. ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ అవిశ్రాంతంగా కృషి చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కులను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, పౌరులుగా మన ప్రాథమిక విధులను పాటించడం కూడా అంతే ముఖ్యం అని వివరించారు.