2 July, 2026 | 3:54 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

క్రీడల వల్ల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి..

12-06-2025 07:24 PM

ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం జేఎన్ఎస్ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ కు సంబంధించి 2025-26 సంవత్సరానికి ఇంటర్ సర్కిల్ కబడ్డీ అండ్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్(Kabaddi and Ball Badminton Tournament)లను ఈ నెల 12 నుండి 14 వరకు నిర్వహిస్తున్నారు. ఈ కబడ్డీ అండ్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి(TGNPDCL CMD Karnati Varun Reddy) హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ముందుగా  స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన క్రీడల జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ... క్రీడల వల్ల ఉద్యోగులు మానసికంగా, శారీకంగా చురుకుగా ఉంటారని, పనిలో మరింత ఉత్తేజంతో పనిచేస్తారని తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆటలు ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు. ఆటపోటీల వలన విద్యుత్ శాఖల మధ్య మరింత స్నేహ పూర్వక బంధం బలపడుతుందన్నారు. ఈ పోటీలలో కబడ్డీ 12 జట్లు, బాల్  బ్యాడ్మింటన్ 9 జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇంచార్జి డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్లాల్, వి.తిరుపతి రెడ్డి, హన్మకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, డిఈ టెక్నికల్ ఏ.విజయేందర్ రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్.  జగన్నాధ్, ట్రెజరర్ ఎమ్.సంతోష్,కౌన్సిల్ మెంబెర్స్ యండి.యాకుబ్ పాషా, వి. సునీల్ కుమార్, ఈ.ప్రేమ్ కుమార్ అన్ని సర్కిళ్ల నుండి క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.