05-11-2025 12:10:02 AM
శంకర్ పల్లి, అక్టోబర్ 4: శంకర్పల్లి మున్సిపాలిటీలో నారాయణ హైస్కూల్లో మంగళవారం ఘనంగా క్రీడా మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌ఐలు శ్రీశైలం, దేవేందర్, పీ ఏ సి ఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచి శారీరక వ్యాయామానికి క్రీడలు ఎంతో దోద పడతాయని వారిదోద పడతాయని వారు పేర్కొన్నారు.
తమ కు ఇష్టమైన క్రీడలో విద్యార్థులు పాల్గొనాలని వారి లో నూతన ఉత్తేజాన్ని నింపారు. కార్యక్రమంలో జిఎం గోపాల్ రెడ్డి , ఏజీఎం వల్లి కుమార్, కోఆర్డినేటర్స్ కనకరాజు, అనూష, వనిత, ప్రిన్సిపల్స్ దివ్య లక్ష్మణ్, థేరిసా, స్వర్ణ రాణి, డిన్స్ వైస్ ప్రిన్సిపల్ ఏవోస్ లు పాల్గొన్నారు.