calender_icon.png 8 January, 2026 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారాలు సరికాదు

07-01-2026 07:45:44 PM

మేడారం అభివృద్ధిని ఓర్వలేక మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో- కన్వీనర్- సునార్కని సాంబశివ

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మహాజాతర శ్రీమేడారం సమ్మక్క సారలమ్మాల జాతర గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష హోదాలో ములుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీతక్క ఎన్నోమార్లు మేడారం జాతరకు ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చెయ్యండి అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగిన కనీసం మేడారం జాతర సమయానికి కూడా నిధులు విడుదల చెయ్యకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి వర్గంలో

ఉన్న ఒక్క మంత్రి ఎమ్మెల్యే లోకల్ లీడర్లు కూడా మేడారం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లెవ్వుని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో- కన్వీనర్- సునార్కని సాంబశివ అన్నారు ఒక ఆదివాసీ బిడ్డగా ములుగు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా సీతక్క మేడారం అంటే ప్రపంచ చరిత్రలో 200ఏండ్లు గుర్తిండి పోయేలా బాధ్యతను తన బుజాలపైన వేసుకోని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఘనత కీర్తి సీతక్కది. 

గత ప్రభుత్వంలో మేడారం జాతర సమయంలో 100ల కొద్ది ఇసుక లారీలు నడిపిస్తు జాతరకు వచ్చేటువంటి భక్తుల వాహనాలకు ఆక్సిడెంట్ లు జరిగేవి. ఆ సమయంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న దనసరి అనసూయ సీతక్క ఒకవైపు జాతర జరుగుతుంటే మరోవైపు ఇసుక లారీలు వందలకొద్ది తిరుగుతున్నాయి ఆపండి అని బీఆర్ఎస్ ప్రభుత్వంను కోరడం జరిగింది దానిని ఈ రోజు కొంతమంది బిఆర్ఎస్ కు చెందిన వ్యక్తులు,పెయిడ్ యూట్యూబ్,పెయిడ్ పింక్ సోషల్ మీడియా,తప్పుడు ప్రచారం చేస్తున్నారు

గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జాతర ఇంకా 4రోజులు ఉన్న సమయంలో కూడా ఇసుక లారీలు నడిపారు కాబట్టి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది మీరు చెప్తే నేర్చుకునే పరిస్తితిలో మా మంత్రి లేరు ఇప్పుడు జరిగే జాతరకోసం ఆల్రెడీ కొన్ని లారీలను మళ్ళించడం జరిగింది. అలాగే జాతర 15రోజులు ఉంది అనగా మొత్తానికే ఇసుక లారీల రాకపోకలను నిలిపివేయడం కోసం సీతక్క అధికారులకు ముందుగానే ఆదేశాలు ఇచ్చారు ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయవద్దని రాజకీయ లబ్ధికోసం దిగజారి మంత్రిపైన లేనిపోని అబండాలు వెయ్యడం మానేయ్యండని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-కన్వీనర్-సునార్కని సాంబశివ హెచ్చరించారు.