07-01-2026 07:48:35 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ 44వ రాష్ట్ర మహాసభలలో తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ గా ఘట్ కేసర్ కు చెందిన అంకం శ్యామ్ కిరణ్ ను నియమిస్తూ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రావులకృష్ణ ప్రకటించారు. శ్యామ్ కిరణ్ బాల్యం నుండే సంఘ్ స్వయక్ సేవక్ గా ఉంటూ దాదాపు 10 సంవత్సరాలుగా ఏబీవీపీ కార్యకర్తగా విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
ఈ సందర్భంగా శ్యామ్ కిరణ్ మాట్లాడుతూ... తనపై ఎంతో నమ్మకంతో తన లాంటి సామాన్య కార్యకర్త కు రాష్ట్రశాఖలో జాయిట్ సెక్రటరీగా అవకాశo కల్పించిన రాష్ట్రశాఖకు ధన్యవాదములు తెలియజేశారు. రానున్న రోజుల్లో విద్యార్థుల సమస్యలపై మరింత ఉద్రిక్తంగా పోరాటం కొనగిస్తానని విద్యార్థులలో జాతీయ భావాలను పెంచటం కోసం మరిన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తామన్నారు.