07-01-2026 07:39:49 PM
మండల విద్యాధికారి సంధ్యారాణి
ఖానాపూర్,(విజయక్రాంతి): రానున్న సీఎం కప్ క్రీడోత్సవాలను విజయవంతం చేయాలని ఖానాపూర్ మండల విద్యాధికారి సంధ్యారాణి అన్నారు. రాష్ట్ర యువజన క్రీడల శాఖ మంత్రిత్వ ఆదేశాల మేరకు బుధవారం చీఫ్ మినిస్టర్ కప్ నిర్వహణ సన్నాహక కార్యక్రమం ఖానాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ నెల 9న జరిగే టార్చ్ ర్యాలీకి అందరూ పాల్గొనాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాకాంత్, ఎంపిఓ సిహెచ్ రత్నాకర్ రావు, పలు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు ,ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.