21-01-2026 05:59:57 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పద్మశాలీల ఆరాధ్య దైవం శ్రీ భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకుని మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుండ మురళి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రీనగర్ అయ్యప్ప ఆలయంలో పద్మశాలీలు మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేసి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి ఆయిల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిరి మహేందర్ లు మాట్లాడుతూ... మృకండు మహర్షి సంతానం అయిన మార్కండేయుడు బాల్యంలోనే శివారాధనతో యముడిని జయించి, ఆ పరమశివుడి ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గునుడు అన్నారు.
పద్మశాలీల ఆరాధ్యుడైన మార్కండేయుడి స్ఫూర్తితో ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే జీవితానికి పరమార్థం ఉంటుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా పద్మశాలీలు సత్తా చాటి మెజార్టీ స్థానాలను గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు మెరుగు యాదగిరి, పద్మశాలీ సంఘం నాయకులు మిట్టపల్లి మురళి, తుమ్మ రాములు, సామల హరికృష్ణ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, సామల రాజేంద్రప్రసాద్, మెరుగు వెంకటేష్, రమణ, యెల్ల రాజు, కామని మొండయ్య, వల్స చందు తదితరులు పాల్గొన్నారు...