20-08-2025 12:40:18 AM
ప్రభాకర్ రెడ్డి గురించి చెడుగా మాట్లాడితే నాలుకలు చీరేస్తాము...
స్థానిక సంస్థల ఎన్నికలు లేక గ్రామాలలో అభివృద్ధి కొంటుపడింది
ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వీర్లతో పెక్కిలించే సమయం వచ్చింది
20 నెలలు గడిచిన ఒక్క శిలాఫలకం వెయ్యలే
మునుగోడు మండల బీఆర్ఎస్ నేతల సంచలన ప్రెస్ మీట్
మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడులో కొంతమంది పూటకో పార్టీ మారే స్థానిక ఎమ్మెల్యే పెంపుడు కుక్కలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై నిరాదరణ ఆరోపణలు చేస్తే నాలుకలు చీరేస్తామని మండల బిఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మందుల సత్యం అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
రాజగోపాల్ రెడ్డి నువ్వు స్థానిక వ్యక్తివి కాదు, ఈ నియోజకవర్గ బిడ్డవు కావు, అయినా ప్రజలు నీ మోసపు మాటలు నమ్మి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అన్ని కక్షసాధింపు రాజకీయాలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి ని అడ్డుకుంటున్నావు అని ప్రశ్నించారు. సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్న అంటున్నావు, దమ్ముంటే ఒక్క సొంత నిధులతో చేసిన అభివృద్ధి పని చూపెట్టూ అంటూ సవాల్ విసిరారు.సోషల్ మీడియాలో వీడియోలు కొరకు తప్ప నీ ఆరాటం అభివృద్ధి మీద లేదు,టికెట్ ఇచ్చి గెలిలించిన పార్టీనే మోసం చేసే నీచపు బుద్ధి నీది అని అన్నారు.ఇంకోసారి నీ చెంచాలతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని ఒక్క మాట అనిపించినా ఈ నకిరేకల్ నియోజకవర్గముకు పంపిస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు.
మంత్రి పదవి కోసం నియోజకవర్గ అభివృద్ధిని ఆగం చేస్తూన్న స్వార్ధపు ఎమ్మెల్యే నువ్వు,ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి అభివృద్ధి కోసం నిధులు తేకపోగా నిత్యం వారిని దూషిస్తున్నావు అని మండిపడ్డారు.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప నువ్వు ఏ ఒక్క ఊరిలో అయిన అభివృద్ధి శిలాఫలకము పెట్టినవా. దమ్ముంటే మండల కేంద్రంలో చర్చకు నువ్వు రా,నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోని నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అని వీరుచక పడ్డారు.ఇంకోసారి స్థానిక కాంగ్రెస్ నాయకులైన రాజగోపాల్ రెడ్డి అయినా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద ఒక్క తప్పు మాట మాట్లాడిన తోలుకలు తీస్తాము అని అన్నారు. మళ్ళీ మునుగోడులో ఎమ్మెల్యేగా వచ్చేది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని తెలిపారు.