calender_icon.png 24 December, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడవటంచ పున:ప్రతిష్ఠ కు రానున్న సీఎం.రేవంత్ రెడ్డి

24-12-2025 08:19:23 PM

ఆలయ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

వివిధ శాఖల అధికారులతో రివ్యూ

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు

రేగొండ,(విజయక్రాంతి): మండలంలోని కొడవటంచ గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పునఃప్రతిష్ట మహోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఫిబ్రవరిలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆలయ అభివృద్ధి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేలా వివిధ శాఖల అధికారులు,గుత్తే దారులతో బుధవారం ఎమ్మెల్యే కోటంచలో రివ్యూ మీటింగ్ జరిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ... మరో 50 రోజుల వ్యవధిలో అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గుత్తే దారులకు సూచించారు.స్వామివారి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో అన్ని పనులు నాణ్యతతో పూర్తి కావాలని అధికారులకు సూచించారు. దాదాపు వందేళ్ల కిందట నిర్మించిన ఆలయాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా భూపాలపల్లి నియోజకవర్గంలోని కోటంచ ఆలయ అభివృద్ధికి రూ.12.15 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు.

ఆలయంలో విమాన గోపుర అర్థ మండపం, మహా మండపం, అద్దాల మండపం, అల్వార్ నిలయం, పాకశాల, క్యూ లైన్లు, అన్నదాన సత్రం, కాంపౌండ్, తాగునీటి సౌకర్యం తదితర పనులు జరుగుతున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని అవసరమైన నిధులు సౌకర్యాలు సమకూర్చాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.