2 July, 2026 | 4:13 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి

06-03-2026 09:41 PM

* వికాస్ నగర్ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన

- ఎన్జీవోస్ కాలనీ వెంకటేశ్వర స్వామి వారి దక్షిణ గోపుర నిర్మాణానికి భూమి పూజ

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 59వ డివిజన్ వికాస్ నగర్ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభయాంజనేయ స్వామి పునఃప్రతిష్ట మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే నాయిని పాల్గొని, స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం 58వ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దక్షిణ గోపుర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భూమి పూజలో పాల్గొని, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఆలయ నిర్వాహకులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ఆలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. ఇలాంటి దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ఎప్పటికప్పుడు సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ నగర్ అభివృద్ధి కమిటీ, సంక్షేమ సంఘం అధ్యక్షులు అధ్యక్షులు పులి వీరారెడ్డి, ప్రతినిధులు ఎం.యాదగిరి రెడ్డి, పంచనేని గోపాలరావు, నైనకంటి జనార్దన్ రెడ్డి, డి. రత్నాకర్ రెడ్డి, శ్యాంసుందర్, అల్లం మల్లికార్జున్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.