calender_icon.png 21 November, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామన్నపేట గురుకుల హాస్టల్‌లో లీగల్ ఎయిడ్ క్లినిక్

21-11-2025 05:18:39 PM

నిర్వహించిన లీగల్ సర్వీసెస్ టీమ్

చిట్యాల,(విజయక్రాంతి): రామన్నపేట మండల పరిధిలోని జనంపల్లి గ్రామం లో గల తెలంగాణ గురుకుల పాఠశాల నందు శుక్రవారం మండల న్యాయ సేవా అధికార సంస్థ అధ్వర్యంలో పాఠశాల ఇంఛార్జి ప్రిన్సిపల్ నాగమణి సమక్షంలో లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు బత్తుల గణేష్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థులకి, కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాల పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

వారికి మధ్యాహ్న భోజన సదుపాయంను, వంటలను పరిశీలించారు. వసతి గృహం నందు విద్యార్దులు ఉపయోగించే వాష్ రూమ్, టాయిలెట్స్, క్లీనింగ్, వంట గదులు, అన్ని పరిశీలించి, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్న లీగల్ సర్వీసెస్ టీమ్ దృష్టికి తీసుకురావాలి సూచించారు. విద్యార్ధులకి ఆర్ బి ఎస్ కే ద్వారా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల విధానం పరిశీలించారు.