calender_icon.png 21 November, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు అగ్రీ క్లినిక్ సేవలు వినియోగించుకోవాలి

21-11-2025 05:26:18 PM

లీగల్ సెల్ సభ్యులు కానుగంటి శ్రీశైలం

చిట్యాల,(విజయక్రాంతి): రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదిక నందు లీగల్ సర్వీసెస్ అధ్వర్యంలో ఆగ్రీ క్లినిక్ (వ్యవసాయ న్యాయ సహాయ సలహా కేంద్రం) సేవలను వినియోగంచుకోవాలని కానుగంటి శ్రీశైలం శుక్రవారం అన్నారు. ఈ క్లినిక్ నందు లీగల్ సర్వీసెస్ నుండి ఆయన హాజరై మాట్లాడుతూ ఇక్కడ రైతులకి కావలసిన భూ చట్టాలు, వయో వృద్దుల సంక్షేమం, వ్యవసాయ అనుబంధ న్యాయ సలహాలు అందించడం జరుగుతుందని అన్నారు. ఏదైనా సమస్యలు ఉన్న ప్రతి మంగళవారం, శుక్రవారాలలో ఇక్కడ క్లినిక్ నందు అందుబాటులో ఉండనున్నట్లు, రైతులు హజరవడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు.