calender_icon.png 21 November, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియామక పత్రం అందుకున్న పత్తి విజ్ఞ తేజ

21-11-2025 05:12:00 PM

నిర్మల్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ నిర్మల్ జిల్లా ఇన్చార్జిగా పట్టణానికి చెందిన పత్తి విజ్ఞ తేజ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాదులోని  ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ కల్వ సుజాత గుప్త నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆర్యవైశ్యులకు చేరేలా కృషి చేస్తానని అన్నారు. నిర్మల్ జిల్లాలో ఆర్యవైశ్యుల సంక్షేమానికి అందరికీ అందుబాటులో ఉండి కృషి చేస్తూనే సంఘం బలోపేతానికి ముందుకు వెళ్తానని పేర్కొన్నారు