21-11-2025 05:08:57 PM
ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఓరుగంటి సత్యనారాయణ అజాత శత్రువు అని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం తుంగతుర్తిలో నిర్వహించిన సత్యనారాయణ ప్రథమ వర్ధంతిలో పాల్గొని మాట్లాడారు. నిరుపేదలకి ఆర్థిక సాయం, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, ఆసరా లేని వృద్ధులకు అండగా నిలవడం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిచిన మహోన్నత వ్యక్తి సత్యనారాయణ అని కొనియాడారు. ఆయన సమాజంలో చేసిన సేవలను స్మరిస్తూ ప్రతి వ్యక్తి మాధవసేవయే మానవసేవగా భావించి, సమాజంలో ముందుకు పయనించాలని కోరారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలు మన్నించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న సంకినేని గోవర్ధన్ రావు, మేనేని మాధవరావు దాయం ఝాన్సీ రెడ్డి, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు పాలవరపు సంతోష్, ఆర్య సంఘ మండల అధ్యక్షుడు ఈగ నాగన్న, రిటైర్డ్ ఉద్యోగులు కాసం మల్లయ్య రాములు సార్ ఈగల లక్ష్మయ్య బండారు దయాకర్ గోపారపు సత్యనారాయణ, ఓరుగంటి కుటుంబ సభ్యులు ఓరుగంట సుశీల ఓరుగంటి శోభ ఓరుగంటి శ్రీనివాస్, జర్నలిస్టులు, స్థానికులు పాల్గొన్నారు.