13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కంచర్లలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు

27-03-2026 09:49 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమాన్ మందిరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాలదారులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలదారులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.