బీసీ కమ్యూనిటీ హాల్కు భూమి వితరణ చేసిన కుటుంబసభ్యులకు సన్మానం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ మరియు పంట పొలాల నిమిత్తం రోడ్డు కోసం భూమి వితరణ చేసిన కుటుంబసభ్యులకు సన్మానం చేసినట్లు గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... గోపాల్పేట గ్రామ వాస్తవులైన కీర్తిశేషులు పావుడాల కిషన్ ధర్మారెడ్డి గ్రామంలో తన సొంత ఇల్లును ఒక ఎకరం భూమిని 30 సంవత్సరాల క్రితం బహుమతిగా ఇవ్వడం జరిగింది.
ఆయన ఇచ్చిన ఇంటి స్థలం స్థలంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నామని, పంట పొలాలకు వెళ్లడానికి నిమిత్తం భూమిని ఇచ్చారన్నారు. భూమి దానంగా ఇచ్చిన సందర్భంగా కీర్తిశేషులు పావుడాల కిషన్ వారసులు ఉన్నారని తెలుసుకొని ప్రవీణ్ కుమార్ రమేష్లను మర్యాదపూర్వకంగా శ్రీరామ నవమి సందర్భంగా శాలువతో ఘనంగా సన్మానించి అభినందన తెలియజేశామన్నారు. కీర్తిశేషులు అయిన పావుడల కిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.




