22 May, 2026 | 8:53 PM

Breaking News

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •  

వాడవాడలా ఘనంగా శ్రీరామనవమి

28-03-2026 12:00 AM

పందిళ్లు వేసి ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణం జరిపించిన వేదపండితులు

భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు

ఆలయ నిర్వాహకులు అన్నదానం, తీర్థ ప్రసాదాల పంపిణీ 

టేకులపల్లి, మార్చి 27,(విజయక్రాంతి): టేకులపల్లి మండల వ్యాప్తంగా వాడ వాడన  శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.  మండలంలోని పలు గ్రామాలలోని శ్రీరామ నవమిని పురస్కరించుకోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణాన్ని అర్చకు లు, పూజారులు కన్నుల పండుగగా నిర్వ హించారు. టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం, బోడు, కోయగూడెం, ముత్యాలంపాడు, సులానగర్, బొమ్మనపల్లి, సంపత్ నగర్, తడికలపూడి, బేతంపూడి, తొమ్మిదోమైల్ తండా, మొక్కంపాడుతో పాటు పలు గ్రామాలలోని  ఆలయాలలో వాడవాడలా చలువ పందిర్లు వేసి శ్రీసీతారాముల కల్యాణాన్ని వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు.

ఆల యాలకు భక్తులు పోటెత్తారు. వేదపండి తుల మంత్రోచ్ఛరణాల మధ్య జరిగిన రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ఆలయాలకు చేరుకుని సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించు కున్నారు. అనంతరం మధ్యాహ్న సమ యంలో జరిగిన స్వామివారి కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, పానకం, పులిహోర, మంచినీరు ప్యాకెట్లను అందించారు. ఆలయాల కమిటీలు, ఆయా సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి  భారీ అన్నదానం చేశారు. ఆయా ప్రాంతాలలో వేదమంత్రాలు, భాజా భజంత్రీల మోతల తో  శ్రీరామనవమి వేడుకలతో సందడి వాతావరణం నెలకొన్నది.