28 March, 2026 | 2:13 AM

జమలాపురం దివ్యక్షేత్రంలో శ్రీ సీతారామ కల్యాణం

28-03-2026 12:00 AM

ఎర్రుపాలెం మార్చి 27 ( విజయక్రాంతి): కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు వెలసిన జమలాపుర క్షేత్రం నందు  కమనీయంగా వార్షిక సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఉదయం ప్రాత:కాల అర్చన అనంతరం నిత్య అనుస్థానములు, హోమములు మరియు ‘బలిహరణ‘ అనంతరం  శ్రీ సీతారాముల విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా మంగళ వాయిద్యముల నడుమ వేదమంత్రోచ్ఛారణలతో కళ్యాణ వేదిక వద్దకు తోడ్కొని వచ్చినారు. 

శాస్త్రముగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మండపారాధనలు, నవగ్రహ పూజల అనంతరం శ్రీ రామచంద్రస్వామిని వరునిగా, సీతమ్మ తల్లిని వధువుగా పూజించి దేవస్థానం తరపున ఉప్పల వెంకట సీతా రామాంజనేయ శాస్త్రి, హైమావతి దంపతులు కన్యాదాతలుగా ఉప్పల విజయ దేవశర్మ సీతమ్మను సమర్పించినారు.

బ్రహ్మశ్రీ పురాణం రవికుమార్ శర్మ  శాస్త్రముగా  సీతారామ కళ్యాణం నిర్వహించినారు. కార్యనిర్వాహణాధికారి శ్రీ కె. జగన్ మోహన్ రావు, మరియు తుళ్లూరు కోటేశ్వరరావు, నిర్మల కుమారి దంపతులు శ్రీవారి తరుపున పట్టు వస్త్రములు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం రమణీయంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ గారు వ్యాఖ్యానం భక్తులను సంతోషపరిచినది.  విచ్చేసిన భక్తులకు వేసవి తాపం దృశ్య మంచినీరు అందించారు.

విశేషముగా అందరికీ అన్న ప్రసాదము వితరణ చేసినాము. ‘రామరసం‘ అను పిలవబడు పానకం పంపిణీ చేసినాము సాయంత్రం 5:30 నుండి  గ్రామ సేవగా హనుమంతుని వాహనంపై సీతారామచంద్రస్వామి వాళ్లను ఊరేగించినాము. కార్యనిర్వహణాధికారి  శ్రీ కె.జగన్ మోహన్ రావు  ఆధ్వర్యంలో సిబ్బంది ఎటువంటి  అవాంతరములు లేకుండా కళ్యాణ మహోత్సవం నిర్వహించినాము.

  శ్రీ స్వామివారి దత్తత దేవాలయమైన సీతారామచంద్రస్వామి దేవస్థానం వెంకటాపురం నందు కూడా సీతారామస్వామి వాళ్ళ దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో  ఆలయ కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్ మోహన్ రావు  వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయ దేవశర్మ, జమలాపురం గ్రామ సర్పంచ్ తుళ్లూరు నిర్మల కుమారి గారు, వకుళమాత స్టేడియం నిర్మాణదాత తుళ్లూరు కోటేశ్వరరావు , గరుడాలయ నిర్మాణ దాత మూల్పురి శ్రీనివాసరావు ,  ఆలయ , ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్, ఉప ప్రధాన అర్చకులు మురళీమోహన్ శర్మ, పేద పండితులు రామదాసి విజయకృష్ణ, వెంపటి సాయి అభిలాష్ అర్చకులు రాజీవ్ శర్మ, ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు గ్రామస్తులు, తర ప్రజా ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు.

ఎర్రుపాలెంలో... మండల కేంద్రమైన ఎర్రుపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం  నందు శ్రీ సీతారామ కళ్యాణం మహోత్సవం వైభవోపేతంగా జరిపించారు. పూజారి శ్రీ నూరిగోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు కళ్యాణం జరిపించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అందించారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ మగినం జయశ్రీ, వీరభద్రరావు దంపతులు, గ్రామ సర్పంచ్ నండ్రు అశ్విని వెంకటేశ్వర్లు దంపతులు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కంచర్ల వెంకట నరసయ్య శాంత కుమారి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.