calender_icon.png 24 September, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ పడిపూజ

24-09-2025 08:11:21 PM

రాజాపూర్: శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ పడిపూజ వేడుకలు బుధవారం మండలంలోని  సింగమ్మ గూడ తాండ గ్రామ పంచాయతీ పరిధిలో ని కేశ్యా తాండలో ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ 41 రోజుల దీక్ష తీసుకొని తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దుర్గామాతకు సేవాలాల్ మహారాజుకి పడిపూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇరుముడులు కట్టుకొని సేవాలాల్ దేవాలయానికి బయలుదేరారు. ఇరుముడి కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు గిరిజనులు భారీగా తరలివచ్చారు. భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు.పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.