calender_icon.png 24 September, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దసరా పండుగకు ఆర్టీసీలో ప్రత్యేక లక్కీ డీప్

24-09-2025 08:19:11 PM

కామారెడ్డి ఆర్టీసీ డిఎం దినేష్ కుమార్

కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దసరా పండుగకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన ప్రయాణికులకు లక్కీ డీప్ ద్వారా బహుమతి అందజేస్తున్నట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ కుమార్ తెలిపారు. బుధవారం కామారెడ్డి ఆర్టీసీడిపో కార్యాలయంలో విజయక్రాంతి ప్రతినిధితో మాట్లాడారు. 27 సెప్టెంబర్ 2025 నుంచి అక్టోబర్ 6 వరకు ప్రయాణం చేసిన అన్ని ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులకు ఈ లక్కీ డీప్ సౌకర్యం ఉంటుందన్నారు.

బస్సు టికెట్ వెనకాల పూర్తి అడ్రస్ ప్రయాణికులు రాసి బాక్స్లో వేయాలని తెలిపారు. ప్రథమ బహుమతి 25000 ద్వితీయ బహుమతి 15000 తృతీయ బహుమతి 10000 లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి అందజేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 8న నిజాంబాద్ ఆర్ఎం కార్యాలయంలో డ్రా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎం దినేష్ కుమార్ కోరారు.