23 March, 2026 | 8:17 AM

శ్రీభాష్యం విజయసారథి మెమోరియల్ అవార్డు ప్రదానం

23-03-2026 12:30 AM

ముకరంపుర, మార్చి 22 (విజయ క్రాంతి): సర్వ వైదిక సంస్థానం వ్యవస్థాపకులు శ్రీ భాష్యం విజయసారథి మెమోరి యల్ అవార్డును ప్రభాకర్ శర్మకు ప్రదానం చేశారు. జిల్లా కేంద్రంలోని యజ్ఞ వరాహ స్వామి ఆలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై అవార్డును ప్ర దానం చేశారు.

అనంతరం శ్రీభాష్యం విజ య సారథి సంస్కృతంలో రాసిన సుమారు 100 పుస్తకాలను సంస్కృతంలో ఒకే పుస్తక రూపంలో ముద్రించారు. ఈ పుస్తకాలను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఆలయ అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.