calender_icon.png 23 January, 2026 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

23-01-2026 05:50:59 PM

మున్సిపల్ కౌన్సిలర్ బరిలో యువ నాయకుడు శ్రీనివాస్

బిచ్కుంద,(విజయక్రాంతి): బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల బరిలో బీజేపీ పార్టీ నుంచి ఏడో  వార్డు కౌన్సిలర్ బరిలో పోటీ చేయడానికి యువ నాయకుడు బిబి పటేల్ మద్దతుతో గోపి శ్రీనివాస్ సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు ఎల్లవేళలా అందుబా టులో ఉంటూ ప్రజాసేవ కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి తాను కట్టుబడి ఉంటానని అభివృధ్యే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

ఒక అవకాశం ఇవ్వండి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పన సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణం వంటి ఇంటింటికి మంచినీటి సదుపాయంతో పాటు నిరుద్యోగ యువతకు లైబ్రరీ ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆయన తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.