మైండ్‌టెక్‌తో శ్రీధర్‌బాబు భేటీ
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీరిక లేకుండా గడుపుతున్నారు. పలు అంతర్జాతీయ కంపెనీలతో వరుస సమావేశాలను నిర్వహి స్తున్నారు. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ మైండ్‌టెక్ సర్వీసెస్ ప్రతినిధులతో శ్రీధర్‌బాబు కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఐటీలో హైదరాబాద్ సాధిస్తున్న వృద్ధి గురించి మైండ్‌టెక్ సలహాదారు డాన్ థెలస్, సీఈఓ రోహన్‌తో మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. అత్యా ధునిక పరిశోధన, ప్రపంచస్థాయి ఐటీ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన నిపుణులు, సరికొత్త ఆలోచనలకు హైదరాబాద్ హాట్‌స్పాట్‌గా మారిందని పేర్కొ న్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటూ తెలంగాణలోని సాంకేతిక విప్లవాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని మంత్రి వెల్లడించారు.






