14 May, 2026 | 1:40 AM

ఎమ్మెల్యేగా శ్రీగణేష్ ప్రమాణం

21-06-2024 01:13 AM

హాజరైన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తన ఛాంబర్‌లో గణేష్‌తో ప్రమాణం చేయించారు.  ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే యెన్నం            శ్రీనివాస్‌రెడ్డి, మక్కాన్ ఠాకూర్ సింగ్ తదితరులు గణేష్‌కు శుభాకాంక్షలు          తెలిపారు.