14 May, 2026 | 12:48 AM

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడిగా విరాహత్ ఆలీ

21-06-2024 01:14 AM

ఖమ్మం, జూన్ 20 (విజయక్రాంతి):  టీయూడబ్ల్యూజే(ఐజెయు) రాష్ట్ర అధ్యక్షుడిగా విరాహత్ ఆలీ,  ప్రధాన కార్యదర్శిగా కే రాంనారాయణ, ఉపాధ్యక్షులుగా గాడిపల్లి మధు (వరంగల్),  ఎంఏకే ఫైసల్ (సంగారెడ్డి), బీ సంపత్‌కుమార్ (పెద్దపల్లి) ఎన్నిక య్యారు. ఖమ్మంలో రెండో రోజు జరిగిన సంఘం రాష్ట్రస్థాయి సమావేశంలో సభ్యులు ఈ మేరకు ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విరాహత్ అలీ ఎన్నిక కావడం ఇది రెండోసారి.

అలాగే కార్యదర్శులుగా కే శ్రీకాంత్‌రెడ్డి (సంగారెడ్డి), జీ మధుగౌడ్ (వనపర్తి), వీ యాదగిరి (హైదరాబాద్), కోశాధికా రిగా ఎం వెంకట్రెడ్డి (మేడ్చల్), కార్యవర్గసభ్యులుగా ఎం వేణుగోపాలరావు (ఖమ్మం), పీ వేణుమాధవరావు (హనుమకొండ), ఆర్ ప్రకాశ్‌రెడ్డి (మంచిర్యాల), ఎం కర్ణయ్య (నాగర్ కర్నూల్), జీ శ్రీనివాస శర్మ (మెదక్), పీ ప్రభాకర్‌రెడ్డి (నల్గొండ), సయ్యద్ అబ్దుల్ లతీఫ్ (కామారెడ్డి), జే సురేందర్‌కుమార్ (జగిత్యాల), ఏ రవీందర్ (కరీంనగర్), ఏ రాజేష్ (హైదరాబాద్), కే రాజిరెడ్డి (సిద్దిపేట), సయ్యద్ గౌస్ మోహియుద్దీన్ (హైదరాబాద్), కే అనిల్‌కుమార్ (హైదరాబాద్), చలసాని శ్రీనివాసరావు (సూర్యాపేట), కంకణాల సంతోష్ (హనుమకొండ), గుడిపెల్లి శ్రీనివాస్ (రంగారెడ్డి) ఎన్నికయ్యారు.