6 March, 2026 | 11:48 PM

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన శ్రీహరిరావు

03-01-2026 12:00 AM

నిర్మల్ జనవరి 2 (విజయక్రాంతి) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గార్లను నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు శుక్రవారం హైదరాబాదులో కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థు లు అత్యధిక స్థానాల్లో గెలుపొందడంపై శ్రీహరి రావు గారిని సీఎం అభినందించారు. మున్సిపల్ ఎన్నికల్లోను విజయం సాధించాలని సూచించారు.