02-01-2026 10:09:02 PM
మోతే,(విజయక్రాంతి): మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామంలో జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఎస్సై అజయ్ కుమార్ సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపట్ల అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సై అజయ్ కుమార్ మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. రోడ్డు ప్రమాదాల బారిన పడటం వల్ల మృత్యువాత పడి చాలా కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు ఉన్నాయని వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా డిఫెన్స్ గా డ్రైవింగ్ చేయాలని సూచించారు.
బైక్ పై వెళ్లేవాళ్లు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, కారులో వెళ్లేవాళ్లు సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోవాలని, ఆటో డ్రైవర్లు ఆటోలో ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించొద్దని అధిక వేగంతో వెళ్ళవద్దని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని నిబంధనలను ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యనికి చేర్చడం వాహన డ్రైవర్ బాధ్యత అని తెలిపారు.