ఓపెన్ ‘తైక్వాండో’ పోటీలలో శ్రీనికకు బ్లాక్ బెల్ట్
25-08-2026 01:53 AM
ముషీరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఇటీవల గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ప్రపంచ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో పద్మాకాలనీకి చెందిన విద్యార్థిని పి. శ్రీనిక బ్లాక్ బెల్ట్ సాధించిది. ఓమా తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకుడు ప్రసన్న ఆంజనేయులు వద్ద శిక్షణ పొందిన శ్రీనిక తైక్వాండో పోటీలలో ఘన విజయం సాధించడం పట్ల పలువురు ఆమెను సత్కరించారు.






