calender_icon.png 2 August, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇర్కోడ్ మోడల్ స్కూల్‌ని సందర్శించిన మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి

24-07-2025 12:06:45 AM

సిద్దిపేట రూరల్, జూలై 23:  తెలంగాణ మోడల్ స్కూల్ ఇర్కోడ్ ను బుధవారం రాష్ట్ర మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసా చారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను, ఉపాధ్యాయుల బోధన విధానం, టీచర్స్ టీచింగ్ డైరీ, లెసన్ ప్లాన్స్, సైన్స్ ల్యాబ్స్, వొకేషనల్ ల్యాబ్స్, సందర్శించారు. అకాడమీ, ఫిజిక్స్ డిజిటల్ తరగతుల తీరు , మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ మాట్లాడుతూ మెళుకువలతో బోధించాలని సూచించారు. విద్యార్థులకు నూతన పద్ధతులను పరిచయం చేయాలని వారి లోపల ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఎఎంఓ రవికుమార్, ప్రిన్సిపల్ రవిందర్ గౌడ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్, దాస్ తదితరులు పాల్గొన్నారు.