24-07-2025 12:06:00 AM
- 200 కొట్లు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణలు
- కెటిఆర్, హరీష్ రావు ఉచిత బస్సు ప్రయాణలను స్వాగతించాలి
- త్వరలోనే తిప్పాపూర్ బస్టాండుకు నూతన శోభ : విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల, జూలై 23( విజయ క్రాంతి); ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని ఆర్టీసి డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన సంబరాల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలను, విద్యార్థులనుసన్మానించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర కు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మి పేరిట మహిళల కోసం ప్రా రంభించిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం కింద గత 18 నెలల్లో రికార్డు స్థాయిలో 200 కోట్ల మంది ప్రయాణించారని తద్వారా 6680 మేర కొట్లు మహిళలకు అదా అ య్యిందని పేర్కొన్నారు.గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసీ డిపోల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి తెలిపారు.. బస్సు ప్రయాణలు జరగడం వలన చిరు వ్యాపారులకు, కిరాణా దుకాణ దారులకు ఎంతో మేలు జరుుతుందన్నారు..ఇప్పటికైనా కెటిఆర్, హరీష్ రావు ఉచిత బస్సు ప్రయాణంలను స్వాగతించాలన్నారు.త్వరలోనే తిప్పాపూర్ బస్టాండ్ కు నూతన శోభ. వస్తుందని తిప్పాపూర్ నుం డీ రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.
భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉం టుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,మార్కేట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్,సిఐ విర ప్రసాద్,డిపో మేనేజర్ శ్రీనివాస్, కాంగ్రె స్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మాజి కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసి సిబ్బంది, ప్రయాణికులు తదితరలు పాల్గొన్నారు.