01-09-2025 08:51:53 AM
హైదరాబాదులో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు
మంథని,(విజయక్రాంతి): అ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలని హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లోని ధర్మశాలలో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(Duddilla Srinu Babu) తన తల్లి జయమ్మ తో కలిసి ఆదివారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ, విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వెంట బంధుమిత్రులు పాల్గొన్నారు.