మిత్రుడికి అండగా 10వ తరగతి స్నేహితులు
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన మందాల దేవయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన చిన్న కుమారుడు సందీప్ 2013–14 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు. మానవత్వాన్ని చాటుతూ తమ వంతు సహాయంగా రూ.20,000 నగదు ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ... కలిసి చదువుకున్న రోజులలో ఏర్పడిన స్నేహబంధం కేవలం ఆనందాలను పంచుకోవడానికే కాకుండా, జీవితంలోని కష్టకాలాల్లో కూడా ఒకరికొకరు అండగా నిలవాలని భావిస్తున్నామని తెలిపారు. మిత్రుడి కుటుంబానికి అవసరమైన సమయంలో తోడుగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు పేర్కొన్నారు. "ఆపదలో ఆదుకునే చేయి, కష్టాల్లో తోడుగా నిలిచే మనసే నిజమైన స్నేహానికి నిదర్శనం" అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కోనరావుపేట 2013–14 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన పలువురు మిత్రులు పాల్గొన్నారు.






