ఘనంగా సెయింట్ పాల్స్ హైస్కూల్ 40వ వార్షికోత్సవం
- విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అమోఘం
- మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్, ఏప్రిల్8(విజయక్రాంతి): నగరంలోని వావిలాలపల్లిలో గల సెయింట్ పా ల్స్ హై స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలను పాఠశాల చైర్మన్ రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ లీనా ప్రియదర్శిని జ్యో తి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
విద్యార్థుల ప్రతిభను, వారిలోని సృజనాత్మకతను ప్రతిబింబించేలా సాగిన ఈ ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ..విద్యార్థులు చదువుతో పాటు క్రమ శిక్షణ, నైతిక విలువలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాల యాజ మాన్యం విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో చేస్తున్న కృషిని ఆయ న అభినందించారు.
కార్యక్రమంలో 51వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు, 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మల్లేశం, 24వ డివిజన్ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ, 25వ డివిజన్ కార్పొరేటర్ గంట శ్రీని వాస్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాల్యాల సుజి త్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




